సౌత్ హీరోల పై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం !

prakash raj

రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరింది. మొత్తానికి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయిని ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధిస్తున్న విజయంపై ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

ఐతే, స్టార్ హీరోల ప్రశంసలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ‘ధురంధర్ 2’ ని సౌత్ స్టార్స్ అభినందిస్తున్నారు కానీ, బాలీవుడ్ స్టార్స్ ఎందుకు స్పందించడం లేదు ?” అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “దక్షిణాదికి సైతం అబ్లిగేషన్ అనేది వ్యాపించినట్టుగా ఉంది” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version