
ప్రకాష్ రాజ్ తీస్తున్న త్రిభాషా చిత్రం ఉలవచారు బిర్యాని ఆడియో కి వస్తున్న స్పందన చూసి ఆయన చాలా ఆనందంగా వున్నారు. ఈ మూడు భాషలలో పాటలను ఇళయరాజా స్వరపరిచారు. తెలుగు వెర్షన్ కి చంద్రబోస్ పాటలు రాసారు
ఐట్యూన్స్ లో ఈ మధ్యే ప్రవేశించిన తమిళ వెర్షన్ పాటలు చార్ట్ బస్టర్ లు గా నిలిచాయి. నేను ఇళయరాజాకి చాలా రుణపడి వుంటానని, ఆయనతో గడిపిన సమయం జీవితంలో మరువలేనిది అని. ఆయన సంగీతం సాగరం లాంటిది అని ప్రకాష్ రాజ్ తెలిపాడు
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సరసన్ స్నేహ నటిస్తుంది. తెలుగు వెర్షన్ ని కె.ఎస్ రామారావు సమర్పిస్తున్నారు.వల్లభ నిర్మాత. మే 1 న ఈ సినిమా మనముందుకు రానుంది