త్రివిక్రమ్ సినిమాపై పుకార్లను ఖండించిన ప్రణీత

pranitha
త్రివిక్రమ్ సినిమానుండి సడన్ గా వైదొలిగింది అంటూ ప్రణీత పై ఇటీవల కొన్ని షాకింగ్ న్యూస్ లు వినిపించాయి. సెట్ లో ప్రణీతపై త్రివిక్రమ్ అరవడమే దీనికి కారణమని వదంతులు వినిపించాయి. అయితే ప్రణీత అసలు ఈ సినిమాకు సంతకమే చేయలేదని చెప్పుకొచ్చింది. అత్తారింటికి దారేది విజయం తరువాత నుండి తన కెరీర్ పై నిందలు వేయడానికి ప్రలువురు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.

ప్రణీత ఆఖరి చిత్రం తారక్ నటించిన ‘రభస’. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు ఇంకా ఖరారు కాకపోయినా ఒక అగ్ర దర్శకుడితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ సెకెండ్ హ్యాండ్ లవ్ అనే కన్నడ చిత్రంలో నటిస్తుంది

Exit mobile version