‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట. అలాంటి దేవకట్ట డైరెక్షన్ లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఎక్కువ పేరు తెచ్చుకున్న మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న సంగతి మంకు తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.
ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా పలువురిని అనుకున్నారు. ఫైనల్ గా ఆ అవకాశం ముద్దుగుమ్మ ప్రణితకి దక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర మరియు ఆ పాత్రకి ప్రణిత అయితే బాగా సరిపోతుందని ఆమెని ఎంచుకున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ కి ఈ చిత్ర టీం సిద్దమవుతోంది.
