మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న ప్రణిత

మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న ప్రణిత

Published on Jun 18, 2015 6:17 PM IST

mahesh-babu-praneeta
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జూన్ 27కల్లా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ బాబు శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ని జూలైలో మొదలు పెడతాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, మహేష్ బాబు సరసన జోడీ కట్టే హీరోయిన్స్ కోసం అన్వేషిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ గా సమంతని ఫైనలైజ్ చేసారని ఇది వరకే తెలియజేశాం. తాజాగా మరో హీరోయిన్ గా మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం ప్రణిత కొట్టేసింది. ప్రణిత కెరీర్ కి ఇది మంచి బూస్టప్ ఇచ్చే ఆఫర్ అని చెప్పాలి. ఇద్దరినీ ఓకే చేసిన ఈ చిత్ర టీం మూడో హీరోయిన్ కోసం చూస్తున్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పివిపి నిమిస్తున్నారు. జూలైలో షూట్ మొదలెట్టి డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారు.

తాజా వార్తలు