బిగ్ బాస్ ఫినాలే గెస్ట్స్ ఎవరంటే…?

big boss

స్టార్ మా ఛానల్ కి నేడు బిగ్ డే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆదరణ పొందిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ నేడు జరగనుంది. నాగార్జున వ్యాఖ్యాతగా వందరోజులకు పైగా సాగిన ఈ రియాలిటీ షో విన్నర్ ఎవరో నేడు తేలనుంది. నేటి సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కొరకు బిగ్ బాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ కు చేరిన రాహుల్,శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజాలలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవనున్నారు. మరి ఇంత పెద్ద ఈవెంట్ కి అతిథులు గా ఎవరు రానున్నారో తెలుసా?

బ్యూటీ రాశి ఖన్నా, దర్శకుడు మారుతీ ఈ షో కి ప్రత్యేక అతిధులుగా రానున్నారు. ప్రతి రోజూ పండగే చిత్రానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న తరుణంలో ఈ చిత్ర యూనిట్ ఈ షోకి అతిధులు హాజరుకానున్నారని చెప్పవచ్చు. గత సీజన్ లో బిగ్ బాస్ ఫైనల్ కి అతిథిగా విక్టరీ వెంకటేష్ వచ్చారు. కాగా ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచేది రాహుల్ అంటూ సోషల్ మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త.

Exit mobile version