‘ప్రేమకథా చిత్రమ్ 2’ విడుదలతేదీ ఖరారు !

Prema Katha Chitram 2

హార్రర్ కామెడీ చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేసింది ‘ప్రేమకథా చిత్రమ్’ . ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. నూతన దర్శకుడు హరికిషన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ని ఖరారు చేశారు. ఆర్ పి ఏ క్రీయేషన్స్ పతాకం ఫై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 21న విడుదలకానుంది.

జేబీ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Exit mobile version