శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమనే ఊరిలో’ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగులో విడుదల కానుంది. మనోజ్ కుమార్ ఈ చిత్రానికి కథ, కథనం అందించి దర్శకత్వం వహించారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైంది. అక్కడ ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తుండటంతో, తెలుగులోనూ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలో రంగాయణ రఘు కీలక పాత్ర పోషించారు. హనుమాన్ చౌదరి సంభాషణలు రాయగా, రాంబాబు గోసాల పాటలు రాశారు. సునద్ గౌతమ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
