‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకకు భారీ ప్లాన్స్!

mahesh-sri
మహేష్ అభిమానులకు పండగ వాతావరణాన్ని కల్పిస్తూ నిన్న విడుదలైన ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఫస్ట్‌లుక్ కూడా విడుదల కాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా కన్‌ఫర్మ్ కాలేదు. దీంతో ఈ పోస్టర్ చూసిన తర్వాత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఈ పండగ వాతావరణాన్ని రెట్టింపు చేసేందుకు మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ’శ్రీమంతుడు’ టీజర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే శ్రీమంతుడు ఆడియో వేడుకకు కూడా ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది.జూన్ రెండో వారంలో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జరపనున్నట్లు సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ మహేష్ కలయికలో రూపొందిన ఆడియో సూపర్ కిక్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషంగా కనిపిస్తోంది.

Exit mobile version