
గోకుల్ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ పతాకాంపై నూతన చిత్ర నిర్మాత మర్రాపు మల్లి కార్జునరావు ‘వీడు మామూలోడు కాడు’, ‘జలక్’ చిత్రాల దర్శకుడు ‘రవి కె శర్మ’ దర్శకత్వంలో పద్మాలయ శాఖ మూరి మల్లిఖార్జున రావు తనయుడు శివ హీరో గా నిర్మిస్తున్న చిత్రం ‘సీత రాముల ప్రేమకథ’ పాటల రికార్డింగ్ జరిగింది ..
నూతన పాటల రచయిత హరీష్ రచించిన ‘హొలా ,,,హో లా … అందరికి హో లా గోలా గోలా యువకుల గోలా’ గీతాన్ని రీటా, కారుణ్య గానం చెయ్యగా సంగీత దర్శకులు ‘వికాస్ కురిమేళ్ళ’ సంగీత దర్శకత్వంలో ఎస్ఎ మీడియా లాబ్స్ లో రికార్డింగ్ జరిగింది . ఈ చిత్రం లోని ఐదు పాటలను భాస్కర భట్ల, గౌరీ వందన, సన్నిదానం నరసింహ శర్మ, హరీష్ అభినయ శ్రీనివాస్ రచించారు.
ఈ చిత్రం లో శివ, మహీ, రైనా, శ్రీ మేఘ, తనికెళ్ళ భరణి ,కొండవలస ,ధన రాజ్ , తాగుబోతు రమేష్ , జోగినాయుడు , గుండు సుదర్శన్ ,ఖాదర్ ఘోరి , వంకాయల సత్య నారాయణ , ప్రియాంక , అల్లరి సుభాషిని , సన , కరాటే కళ్యాణి , రమణి, మంజుషా, తదితరులు నటిస్తుండగా ఈ చిత్రానికి రచన సహకారం వింజ మూరి అచ్యుత రామయ్య , మాటలు : సూర్య కుకు నూర్ , ఎడిటింగ్ : నందమూరి హరి , ఛాయా గ్రహణం : మహేష్ రాయల్, ఫైట్స్ : రామ్ లక్ష్మన్ , కద, నిర్మాత మర్రాపు మల్లి కార్జునరావు , స్క్రీన్ ప్లే ,దర్శకత్వం రవి కె శర్మ,
ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందే ప్రేమకథా చిత్రమని, ఒక ప్రముఖ కళాత్మక దర్శకులు ముఖ్య పాత్రను నటించే అవకాసం వుందని ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చిత్ర దర్శకులు రవి కె శర్మ తెలియ జేసారు.