
‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రం తరువాత వరుస ఆఫర్లతో బిజీ గా మారాడు. ఇక ఆయన ఒక బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.
పద్మ శ్రీ అవార్డు గ్రహీత అయిన చేనేత కార్మికుడు మల్లేశం జీవితం ఆధారంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఓక బయోపిక్ ను నిర్మించనుంది. ఈచిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.