పెటాకి పోజులిచ్చిన ప్రియమణి

Priyamani
తెలుగు బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ప్రియమణి కూడా ఒకరు.. ప్రియమణి తాజాగా జీవ హింసకి వ్యతిరేకంగా చేస్తున్న పెటా సంస్థతో కలిసి ఓ ప్రత్యేక ఫోటో షూట్ చేసింది. ఇప్పటికే పెటా కోసం చాలా మంది తారలు ప్రచారం చేసారు. తాజాగా ప్రియమణి కూడా సౌత్ ఇండియా తరపున ఈ పెటా ని సపోర్ట్ చేసే వారిలో జాయిన్ అయ్యింది.

పెటా కోసం చేసిన ఫోటో షూట్ లో ప్రియమణి టైగర్ చర్మాన్ని పోలి ఉండే అవుట్ ఫిట్ లో కనిపించింది. దీనికి ‘టైగర్స్ బోనులకి పరిమితం కాదని’ కాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొట్టడమే కాకుండా బాగా పాపులర్ అవుతోంది.

నేషనల్ అవార్డు గెలుచుకున్న ప్రియమణి ఎన్నో తెలుగు, తమిళ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రియమణి కన్నడలో తన హవా కొనసాగిస్తోంది.

Exit mobile version