ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఓజి’ హీరోయిన్ ‘మేడ్ ఇన్ కొరియా’

Made in Korea

కోలీవుడ్ యంగ్ అండ్ గార్జియస్ హీరోయిన్ ప్రియాంక మోహన్ పవర్ స్టార్ సరసన ఓజి సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రమే ‘మేడ్ ఇన్ కొరియా'(Made in Korea). దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నేరుగా రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకి నేడు మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ ఈ అర్ధ రాత్రి నుంచే ఉంటుంది అనుకున్నారు కానీ నెట్ ఫ్లిక్స్ ట్విస్ట్ ఇస్తూ దానిని ఈ మధ్యాహ్నం వరకు హోల్డ్ చేశారు. ఇలా ఫైనల్ గా మార్చ్ 12 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో ఈ కొత్త సినిమాని చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

కొరియన్ డ్రామాలు, సినిమాలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటివారు కూడా ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమా ఒరిజినల్ తమిళ్ తో పాటుగా తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని రా కార్తీక్ దర్శకత్వం వహించారు.

Exit mobile version