యంగ్ హీరో డెడికేషన్ చూసి థ్రిల్ అయిన టాప్ రైటర్

nikhil-kona-venkat
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి నటే సినిమా పట్ల పాషన్, కమిట్ మెంట్ తో పాటు స్వయం కృషి ఎక్కువగా ఉండాలి. అలా ఉన్న చాలా మంది ఇప్పటికే తూల్ల్వుడ్ లో సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అలా రీసెంట్ టైమ్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ పోతున్న యంగ్ హీరో నిఖిల్. సినిమా సినిమాకి తన కథలోనే కాదు తన నటనలోనూ సరికొత్తదనాన్ని చూపిస్తున్న నిఖిల్ స్వామి రారా, కార్త్కేయ సూర్య vs సూర్య సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత నిఖిల్ చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యుఎస్ లో జరుగుతోంది. గత కొద్ది రోజులుగా నిఖిల్ పై వచ్చే ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారు. ప్రేమ రక్షిత్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్ర కథా రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్ నిఖిల్ సినిమా కోసం చూపిస్తున్న కమిట్ మెంట్ చూసి థ్రిల్ అయ్యాడు. ‘నిఖిల్ సినిమా కోసం చూపిస్తున్న డెడికేషన్ నన్ను థ్రిల్ చేసింది. నిఖిల్ కి టాలీవుడ్ లో చాలా మంచి భవిష్యత్’ ఉందని కోన వెంకట్ తెలిపాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తోంది. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాకు ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలో ఓ బీహారీ గ్యాంగ్ కి అధినేతగా అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని సమాచారం.

Exit mobile version