ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం కోసం తెలిసిన వారు అందరికీ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కోసం తెలిసే ఉంటుంది. ఏది వెతకాలి అన్నా గూగుల్ తోనే ఇంటర్నెట్ మూలాన సోషల్ మీడియా అంతర్జాలం ఇపుడు ప్రపంచాన్ని ఏలుతుంది, సరే దీనివల్ల అందరికీ మంచే జరుగుతుందా అంటే దానికి సమాధానం ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఈ విస్తరణ చెందిన ఇంటర్నెట్ వాడకంలో సోషల్ మీడియా వేదిక అత్యంత ప్రాచుర్యం పొందింది.
దీనితో నెట్ కనెక్షన్ ఉండి ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో భావ ప్రకటనా స్వేచ్చ అనేది ఒక హక్కులా సంక్రమించేసింది. మరి దానిని ప్రతీ ఒక్కరూ సక్రమంగా వాడుకోకుండా ఇతరుల వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది కలిగించేలా చేస్తుంది, ఛిద్రం అయ్యేలా చేస్తుంది. మరి దాని వలనే తాను గత రెండు సంవత్సరాలుగా ఎంత ఇబ్బందులు పడుతున్నానో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ క్లుప్తంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి తెలియజేసారు.
“సోషల్ మీడియా వలన ఒక్కరికీ లాభం చేకూరుతుంది అని విశ్వసించిన వాళ్లలో తాను కూడా ఒకడిని అని కానీ దాని మూలాన గత రెండు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డానో దాన్ని ఇప్పుడు మీకు తెలపడం మూలాన ఏమైనా మార్పు వస్తుందేమో అని తెలుపుతున్నాని చెప్పారు. ఇంటర్నెట్ మూలాన అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేసే వారు కూడా అధికం అని వారి మూలాన ఇప్పటికే ఎంతో మంది మహిళలు లైంగిక వేధింపులకు గురైన వారు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారని గుర్తు చేస్తూ అలాంటి చర్యలకు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వాడే వారి వల్ల తాను తన ఆరేళ్ళ కూతురు ఎంతో ఇబ్బంది పడడం వర్ణనాతీతం అని భావోద్వేగంతో ఈ విషయాన్ని తెలిపారు.
టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాతగా ఉన్న నాకే నా కూతురిపై ఒక మానసిక స్థిమితం లేని సైకో నుంచి వచ్చిన బెదిరింపు పోస్టులని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి తల ప్రాణం తోకకి వచ్చింది మరి అలాంటిది ఇతరుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఒకప్పుడు అంటే ఒకరి పరువు తియ్యడానికి ఎంతో కష్టపడే వాళ్ళు కానీ ఇప్పుడో? సింపుల్ గా ఒక మార్పింగ్ చేసిన ఫోటో లేదా అసభ్యంగా మాట్లాడిన భాష చాలు వారిని బద్నామ్ చెయ్యడానికి.
ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇంటర్నెట్ చట్టాలు, సమాచారం అనే మనషి కి బట్టలు కడతాయి ఏమో చూడాలి. భావప్రకటనా స్వేచ్ఛ అనే పదును వైపు పెడుతున్న మీ శ్రద్ద అవతలి పదును వైపు కూడా పెడితే బాగుంటుంది. మేము పెడుతున్నాము అని అనుకోవచ్చు కానీ దాని సమర్థత వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది ?? ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ తమ కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ ఉత్తరం అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది” అని ఫేస్బుక్ ద్వారా ఈ భావోద్వేగపూరిత ఉత్తరాన్ని పొందుపరిచారు.