రీసెంట్ గా లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వస్తున్న లేటెస్ట్ చిత్రమే ‘హే భగవాన్’. ఒక ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత వంశీ నందిపాటి విలేకరులతో ముచ్చటించారు. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.
‘హేభగవాన్’ ఎలాంటి సినిమా?
హేభగవాన్.. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా.. స్టోరీ లెవల్ నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ప్రజెంటర్‌గా ఉన్నాను. ఈ సినిమా పాయింట్‌లో ఫన్ ఉంటుంది. సినిమాలో బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ ఎలిమెంట్ ఉపయోగపడుతుది. ఫన్ ప్లస్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది.
సినిమా ట్రైలర్, టీజర్‌లో బిజినెస్ అంటూ ఓ ఆసక్తికరమైన టాపిక్ పెట్టారు ఎందుకని?
ఆసక్తి, బజ్ పెంచడానికి అలా పెట్టాం. అయితే ఆ బిజినెస్ ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.
సుహాస్‌కు ఈ సినిమా ఎంత వరకు ప్లస్ అవుతుంది?
గత కొంతకాలం నుంచి సుహాస్ ఎదురుచూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈసినిమాతో సాధించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలుస్తుంది. ఈసినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది.
ప్రొడ్యూసర్‌గా మీ స్ట్రాటజీ ఏమిటి?
మోర్ దెన్ ప్రాపర్‌గా క్రియేటివ్ స్ట్రాటజీస్ట్‌గా అనేది కరెక్ట్ పదం. అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. దర్శకుడికి ఎక్కడైనా అనిపించిన దగ్గర సలహా ఇస్తాం. వాళ్లు ఓకే అంటేనే మార్పులు చేశాం. దర్శకుడు హ్యపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. మొత్తం వాళ్ల అనుమతి మేరకే జరుగుతుంది.
ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాణం బాగా తగ్గిందనుకోవచ్చా?
లిటిల్ హార్డ్స్, రాజు వెడ్ష్ రాంబాయ్ తరువాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిష్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం కూడా చేసే సినిమాలు పెరిగాయి.
బన్నీ వాసు గారితో మీ అనుబంధం?
బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వాడు. ఆయనతో మొదట్నుంచీ కలిసి ట్రావెల్ అవుతున్నాం. ఆయన ఓకే చేసిన నేను ఓకే చేసినట్లే..
మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉంటాయి
పొలిమేర – 3 డిటైల్స్ చెప్పండి?
పొలిమేర – 3 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ లేదా మేలో ప్రారంభింస్తాం. హిందీలో మినహా దక్షిణాది సినిమాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకు లీడ్ రోల్‌లో ఎవరైనాస్టార్ యాడ్ అయితే బాగుంటుంది అనుకున్నాం. త్వరలోనే తెలియజేస్తాం.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు ఏంటి?
ఈటీవీ విన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను. ఈ నెల 27 అది అనౌన్స్‌మెంట్ చేస్తాను. ఈటీవీతో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను.
