నిర్మాతగానే కాదు నటుడిగానూ.. ‘ఛాంపియన్’లో యశ్ రంగినేని నయా అవతార్!

Yash Rangineni

‘పెళ్లి చూపులు’, ‘డియర్ కామ్రేడ్’, ‘దొరసాని’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించి నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యశ్ రంగినేని (Yash Rangineni). బిగ్ బెన్ సినిమాస్ అధినేతగా జాతీయ అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు నటుడిగానూ తన సత్తా చాటుతున్నారు. తాజాగా రోషన్ మేక హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో విడుదలైన ‘ఛాంపియన్’ చిత్రంలో యశ్ కీలక పాత్రలో నటించారు.

ఈ చిత్రంలో ‘వీరయ్య’ అనే పాత్రలో యశ్ రంగినేని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చదువురాని వ్యక్తిగా, గ్రామీణ అణగారిన వర్గాలకు ప్రతినిధిగా ఆయన కనిపించారు. తక్కువ సంభాషణలతోనే.. కళ్లలో తీవ్రతను, అంతర్గత సంఘర్షణను అద్భుతంగా పండించారనే ప్రశంసలు లభిస్తున్నాయి.

నిర్మాతగా ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే యశ్, నటుడిగానూ సీరియస్ రోల్‌లో ఒదిగిపోయారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, వీరయ్య పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version