ప్రమోషన్స్‌ ‘శ్రీమంతుడు’కి కలిసి వచ్చాయ్ : మహేష్

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ఈ సినిమా మొదటివారం ముగియకముందే 50 కోట్ల మార్క్‌ను టచ్ చేయనుందని ట్రేడ్ టాక్. ఇక తమ సినిమాకు ఈ స్థాయి విజయం దక్కడం పట్ల మహేష్‌తో పాటు టీమ్ మొత్తం హ్యాపీ మూడ్‌లోకి వెళ్ళిపోయారు.

‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి రెండు బాక్సాఫీస్ పరాజయాల తర్వాత మహేష్ కెరీర్లో వచ్చిన సినిమా కావడం, మొదటిరోజే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ‘శ్రీమంతుడు’ పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. తాము సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడం వల్లనే మొదటి షోకే మంచి టాక్ వచ్చిందని మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రమోషన్లలోనే సినిమాలో ఏం చెప్పాలనుకున్నది తెలియజేయడంతో పాటు, బేసిక్ స్టోరిలైన్‌ కూడా చెప్పడంతో ప్రేక్షకులు ముందే ఒక అవగాహనతో రావడం జరిగిందని సినిమాకు ఆ అంశం బాగా కలిసివచ్చిందని మహేష్ స్పష్టం చేశారు.

Exit mobile version