దేశ రాజధానిలో దుమ్ము రేపిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas books

న్యూ ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలలో దైవీయ స్పృహల గ్రంధాల అపురూప రచనలు చేయడంలో , సంకలనాల ప్రచురణలో అందెవేసిన చెయ్యి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దని ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. నిస్వార్ధ సేవలో, అద్భుత రచనల్లో , ఆధ్యాత్మిక ప్రచురణల ప్రచారోద్యమంలో తెలుగు రాష్ట్రాలలో తొలి వరుసలో దూసుకు పోతున్న ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఇప్పుడు దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో కూడా దుమ్మురేపారు. సాక్షాత్తూ ఈ దేశ హోంశాఖామంత్రి అమిత్ షా తో ‘ నన్నేలు నా స్వామి ‘ అనే తన హనుమాన్ మహాగ్రంధాన్ని ఆవిష్కరింప చేసి ‘ శభాష్ ‘ అనిపించుకున్నారు.

ఇదేమన్నా మామూలు విషయం అనుకుంటున్నారా ? ఈ దేశ హోమ్ మంత్రిని కలవడం మామూలు విషయమా ? మామూలు సెక్యూరిటీనా ? తమ పార్టీలో … తమ సహచార మంత్రులే గంటగంటలు వెయిట్ చేసినా ఇంటర్వ్యూ దొర కని ఘటనలు కూడా లేకపోలేదు. ఆయా రాష్ట్రాల భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు కొందరు ఎన్ని రోజులు పడిగాపులు పడి వున్నారో వాళ్ళకే తెలుసు ? జనసేన పవన్ కళ్యాణ్ కి అప్పోయింట్మెంట్ దొరికినా రెండు గంటల తర్వాతే అమిత్ షా మాట్లాడారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పది సార్లు ప్రయత్నిస్తే మూడు సార్లు మాత్రమే అమిత్ షా లోపలి పిలిచారని మీడియా కోడై కూసింది కూడా. పరిమిత పరిధుల నుండి అపరిమితస్థితికి తీసుకెళ్లేలా తెలుగు రాష్ట్రాలలో పవిత్ర ఆధ్యాత్మిక సేవ విస్తృతంగా చేస్తున్న పురాణపండ శ్రీనివాస్ కి వెంటనే ఈ ఘనత దక్కడానికి ఆయన హృదయ సంస్కారమే కారణం. నిస్వార్ధ సేవ, నిష్కపట హృదయమే కారణం. జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లకు, ఎత్తు పల్లాలకు సాక్ష్యంగా నిలిచిన ‘ పురాణపండ శ్రీనివాస్’ అద్భుతమైన ఆంజనేయ స్వామి రచనా సంకలనాన్ని చూసిన అమిత్ షా గారు మొత్తం పుస్తకం తిరగేసి ఆశ్చర్య పోయారట. ఇంతమంది ఆంజనేయ స్వాముల్ని , ఇన్ని మహా మంత్రం శక్తుల్ని , ఇంత చక్కని వ్యాఖ్యానాల్ని తెలుగులో అందించిన పురాణపండ శ్రీనివాస్ భుజంపై చెయ్యివేసి మరీ అభినందించారుట. ఇదేమైనా మామూలు విషయమా.?

ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి, ఎన్నో కష్టాలు పడి , విమర్శలకు వెరవక , ఒంటరిగా కష్టపడే ఒక ప్రతిభావంతునికి భగవంతుని కరుణ కాకపోతే మరేమిటి? ఇది హనుమంతుని అపారమైన కటాక్షం. స్వయంకృషికి దక్కిన ఫలితం. అంతే కాదు , ఈ మహా గ్రంథ ప్రచురణ కర్తలైన వారాహి చలన చిత్రం అధినేత , ఈగ, లెజెండ్ వంటి ఎన్నో సినిమాల నిర్మాత సాయి కొర్రపాటి పై పురాణపండ శ్రీనివాస్ కి ప్రేమ ఒకింత ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటె ఎవరైనా తాను హైలెట్ అవ్వాలని చూస్తారు, కానీ … అమిత్ షా గారు ఈ అఖండ గ్రంధాన్ని ఆవిష్కరించే సమయంలో గ్రంథ సమర్పకుడు సాయికొర్రపాటి ని ముందు పెట్టి , తాను వెనెక వైపు వెళ్లడం పురాణపండ శ్రీనివాస్ని మంచితనం చాలామందిని ఆశ్చర్య పరిచింది. అదీ శ్రీనివాస్ సహృదయ సంస్కారం.

సుమారు ఆరువందల పేజీలతో అత్యంత ఆకర్షణీయంగా , పరమ రమణీయంగా , అందమైన పవిత్ర వ్యాఖ్యానంతో పురాణపండ శ్రీనివాస్ చాలా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించిన ఈ మహాగ్రంధం అమిత్ షా ఆవిష్కరించడాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి గారు అద్భుతంగా పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సమయంలో కిషన్ రెడ్డి చూపిన చొరవ , ఉత్సాహం , సహకారం మరువలేనివని సాయి కొర్రపాటి కృతజ్ఞతలు చెప్పారు. హనుమంతుని అనుగ్రహంతో , ఎంతో అసాధారణ ప్రతిభతో పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంధాన్ని అందించారని, ఈ మంత్రం సంపదను సమర్పించే భాగ్యం తనకి కలిగినందుకు, అమిత్ షా వంటి రాజనీతిజ్ఞత కలిగిన హోమ్ శాఖామంత్రి ఆవిష్కరించడం మరువలేని ఘటనగా సాయి కొర్రపాటి చెప్పారు. అమిత్ షా గారు ఆవిష్కరించిన మొదటి తెలుగు గ్రంధం కూడా ఇదే కావడం తో ‘ నన్నేలు నా స్వామి’ మహా గ్రంధం చరిత్రకెక్కింది కూడా.

కష్టపడే వాడికి, స్వార్ధం తెలియని వాడికి , ప్రతిభ పుష్కలంగా వున్న వాడికి,పదిమందికి అన్నం పెట్టే వాడికి దైవం ఎలా అనుకూలిస్తుందో పురాణపండ శీనివాసే మన కన్నుల ఎదుట ప్రత్యక్ష తార్కాణం. శ్రీనివాస్ ఎంత కష్టపడి పని చేస్తారో , జీవన పోరాటంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనతో పరిచయం వున్న వారందరికీ ఎరుకే. ఈ ఆవిష్కరణోత్సవం లో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కుమారుడు హర్షవర్ధన్ పాల్గొనడం కూడా హర్షణీయమని విజ్ఞులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పురాణపండ శ్రీనివాస్ నైతికతకు కాలం ఎత్తిన జయపతాకమే ఈ సన్నివేశం.

ఆంజనేయుని కటాక్షం వల్లనే అమిత్ షా ఈ మహా గ్రంధాన్ని ఆవిష్కరించారని , తాను నిమిత్తమాత్రుడనని పురాణపండ శ్రీనివాస్ చెప్పడాన్ని మనం కూడా సమర్ధించాల్సిందే !. ” ‘ ‘అద్భుతః , అద్భుతః, అద్భుతః ‘… మనం కూడా మనసారా శుభాకాంక్షలు చెబుదాం.

Exit mobile version