తెలుగులో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి.. యూత్ ని ఎట్రాక్ట్ చేసిన శ్రద్దాదాస్ చాలా గ్యాప్ తరువాత ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించడం విశేషం. ఒక వేశ్య మనో భావాన్ని కల్మషం లేని హృదయాన్ని కళాత్మక దృష్టి తో తెరకెక్కించిన ఈ చిత్రం పేరు ‘ప్యూర్ సోల్’. బాలీవుడ్ లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ లఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ నటించటం మనకు తెలుసు.. టాలీవుడ్ లో కూడా ఇప్పడు అదే తరహలో చాలా బోల్డ్ పాత్రలో శ్రద్ధాదాస్ నటించడం విశేషం.
కథ విషయానికోస్తే వర్ణ ప్రేమ లో విఫలమైన ఒక మంచి పెయింటర్.. తన ప్యారిస్ ఎగ్జిబిషన్ లో 100 వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య( శ్వేత) ని ఎంచుకుంటాడు. తను ప్రేమించిన అమ్మాయి తన మెదటి పెయింటింగ్ గా మెదలు పెట్టిన వర్థ తన నూరవ పెయింటింగ్ ని శ్వేతని ఎంచుకుంటాడు.. అయితే పెయింటింగ్ వేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో శ్వేత లో ఒక ప్యూర్ సోల్ ని చూస్తాడు వర్ణ. అదే సమయంలో సమాజంలో నిజాయితీని వర్ణలో చూస్తుంది శ్వేత. తను ప్రేమించిన అమ్మాయి లో అబద్దాన్ని చూసిన వర్ణకి శ్వేత లో ప్యూరిటి ఆఫ్ వుమెన్ కనిపించింది. వీరిద్దరి మద్య జరిగిన సంభాషణలో వర్ణ పెయింటింగ్ వేస్తాడు.. అసలు ఆ పెయింటింగ్ ఎంటి అనేది దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు..
దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి చక్కగా తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించాడు. ముఖ్యంగా వర్ణ, శ్వేత ల మధ్య వచ్చే సంభాషణలు చాలా చక్కగా రాసుకున్నాడు. ఈ ప్యూర్సోల్ అనే లఘ చిత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో స్క్నీనింగ్ చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత శివశక్తి దత్తా, ప్రముఖ నిర్మాతలు రామ్ తల్లూరి, రజని తల్లూరి, రాజ్ కందుకూరి మరియు సక్సస్ ఫుల్ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ లు హజరయ్యారు.