పూరీ.. పూర్తి స్థాయి విప్లవ చిత్రం!

puri-jaganth
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పూర్తి స్థాయి విప్లవ చిత్రాన్ని తీయనున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో విప్లవ సినిమాల కథానాయకుడంటే వినిపించే ఒకే ఒక్క పేరైన.. ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇదే విషయమై నారాయణ మూర్తికి చిత్ర కథను వినిపించగా, ఆయన ఓకే చెప్పినట్లు టాక్. నిజానికి టెంపర్ సినిమాలోని ఓ కీలక పాత్రకు ఆయన్ను సంప్రదించగా, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను పూర్తి స్థాయి విప్లవ సినిమాలకే పరిమితమని చెప్పారు. ఇప్పుడు పూరీ పూర్తి స్థాయి విప్లవ కథతోనే ఆయన్ని సంప్రదించడంతో నారాయణ మూర్తి ఈ చిత్రంలో నటించే అవకాశాలే ఎక్కువ అని అంటున్నాయి చిత్ర వర్గాలు.

ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్, చార్మీతో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా పూర్తవ్వగానే ఆర్. నారాయణ మూర్తి సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. పూరీ, మహేశ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుందని చెప్పుకుంటున్నా, అందుకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఈలోగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పూరీ.

Exit mobile version