
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. ఈ సినిమాలో పాట కోసం దర్శకుడు తన గొంతు సవరించుకున్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో కలిసి ‘దేవుడా.. ‘ అనే పాటను పూరి జగన్నాధ్ ఆలపించారు. ఈ పాట ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే రేపు ఆడియో విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. ఈ పాటను భాస్కర భట్ల రచించారు. మహేష్ ‘బిజినెస్ మాన్’ సినిమాలో ‘అబ్ సాలే..’ అనే పాటను పూరి పాడిన సంగతి తెలిసిందే. జనవరి 28న ‘టెంపర్’ ఆడియో అభిమానుల సమక్షంలో శిల్పకళా వేదికలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఒక స్టార్ హీరో నటించిన కమర్షియల్ సినిమాకు అనూప్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి.
ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. అభిమానులలో భారి అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

