పూరి డిసెంబర్ లో మొదలెట్టనున్నాడట !

Puri Jagannadh

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరిసినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి. అయితే విజయ్ దేవరకొండ సినిమా తర్వాత, పూరి.. బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథ కూడా ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఈ కథలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version