వర్మ కోసం కథ సిద్ధంగా ఉందంటున్న పూరి !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఉదయం ‘జిఎస్టీ’ వెబ్ సిరీస్ వివాదం విషయమై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. బయటి జనమంతా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తుంటే వర్మ మాత్రం తన స్టైల్లో ఈజేజీ తీసుకోవడమేగాక ఎంజాయ్ చేస్తున్నారు కూడ.

వర్మ తనకు పోలీసుల పనితీరు బాగా నచ్చిందని, తనకి కూడ పోలీస్ పాత్రలో నటించాలని ఉందని, దయచేసి దర్శకులు తన కోసం పోలీస్ స్క్రిప్ట్ రాయాలని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. దీని స్పందించిన ఆయన శిష్యుడు, దర్శకుడు పూరి జగన్నాథ్ తన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందని, మీరు డేట్స్ ఇవ్వడమే ఆలస్యమంటూ సమాధానం ఇచ్చారు. ఇదంతా సాధ్యపడని వ్యవహారమే అయినా వర్మ పోలీస్ పాత్ర చేయాల్సిందేనని మైండ్ లో బ్లైండ్ గా నిర్ణయించేసుకుంటే తన దర్శకత్వంలో తానే నటించినా నటించవచ్చు మరి.

Exit mobile version