
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపు దిద్దుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో ‘హార్ట్ అటాక్’ అనే రొమాంటిక్ లవ్‌స్టోరీ రూపొంది విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ బాగుందనిపించుకుంది. ‘హార్ట్ అటాక్’ సినిమాతో పూరీ-నితిన్‌ల కాంబినేషన్‌పై మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక వీరిద్దరి కలయికలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రానుందనగానే సినిమాపై మరింత ఆసక్తి చెలరేగింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా అనౌన్స్ అయిన కొద్దిరోజులకే పూరీకి, చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. దీంతో నితిన్ సినిమా కొన్నాళ్ళ పాటు పక్కకు తప్పుకుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటినీ కొట్టిపడేస్తూ నితిన్ ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. “ఇప్పుడే పూరీ గారి ఫైనల్ నెరేషన్ విన్నా. హర్ట్ టచింగ్‌గా ఉంది. జూన్ 15నుండి షూటింగ్ మొదలవుతుంది.” అంటూ ట్వీట్ చేశాడు నితిన్. చిరంజీవి 150వ సినిమా ఆగష్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా లాంచ్ కానున్న విషయం తెలిసిందే! ఈలోగా నితిన్ సినిమాను పూరీ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘జ్యోతిలక్ష్మీ’ ఈనెల 12న విడుదల కానుంది.