పూరి జగన్నాధ్ తో వరుణ్ తేజ్ సెకండ్ మూవీ.?

varun-tej (1)
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుంద’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తన రెండవ సినిమాని పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేయనున్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాని సి. కళ్యాణ్ నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. పూరి జగన్నాధ్ చేసే సినిమా ఆ హీరోకి ప్లాప్ అయిన.. హిట్ అయినా.. హీరోకి మాత్రం మాస్ లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. కావున 6 అడుగులు ఉన్న వరుణ్ తేజ్ ని పూరి జగన్నాధ్ బాగానే వాడుకొని అందరినీ మెప్పించగలడని ఆశించవచ్చు. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version