
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో ఆరడుగుల యంగ్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద తో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా పేరున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సినిమా చేసేసాడు. అంతే కాకుండా తన తదుపరి సినిమాలను కూడా క్రేజీ డైరెక్టర్స్ తో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. మొదటి సినిమా తర్వాత రెండవ సినిమా క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.
ప్రస్తుతం క్రిష్ 1945 మరియు ప్ర్రస్తుత బ్యాక్ డ్రాప్ కి లింక్ పెట్టి రొమాంటిక్ లవ్ స్టొరీగా చేస్తున్న ‘కంచె’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా జూన్ లో ప్రారంభం కానుంది. ఈలోగా వరుణ్ తేజ్ కంచె సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తాడు. అలాగే పూరి కూడా ప్రస్తుతం ‘జ్యోతి లక్ష్మీ’ని ఫినిష్ చేసి మేలో రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. పూరి – వరుణ్ తేజ్ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే పూరి వరుణ్ తేజ్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ ని దాదాపు పూర్తి చేసాడు.