దసరా కానుకగా రిలీజ్ అయిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంశలు అందుకుంటున్న హీరో వరుణ్ తేజ్. నటన పరంగా వరుణ్ కి చాలా మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా కంచె. మొదటి రెండు సినిమాలతో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ట్రై చేసిన వరుణ్ తేజ్ తన మూడవ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో కలిసి పర్ఫెక్ట్ పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సిద్దం చేసాడు. ఆ సినిమా పేరే ‘లోఫర్’. సినిమా మొదలైనప్పుడే ఈ టైటిల్ ని అనౌన్స్ చేసిన పూరి ఇప్పుడు ఆ టైటిల్ ని మార్చే పనిలో ఉన్నాడు. ఫైనల్ గా ఈ లోఫర్ సినిమా ‘మా అమ్మ సీతామహాలక్షి’ పేరుతో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ని కూడా ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉంది. ఇన్ని రోజులు కంచె రిలీజ్ కోసం ఆగిన పూరి, ఆ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఈ సినిమాకి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు. మేము ఇది వరకే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాము. అనుకున్న దాని ప్రకారమే డిసెంబర్ 18న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నారు. పూర్తి మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపిస్తాడు. దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి సి కళ్యాణ్ నిర్మాత.
