పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వంలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దేవ నాయకి’ అనే ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. “ఇలస పులస ఎలా అయ్యిందో” తెలియాలంటే ఈ పాట చూడాల్సిందే అంటూ మేకర్స్ ఆసక్తిని పెంచుతున్నారు.
అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, సాహితి చాగంటి ఎనర్జిటిక్ గా ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో బాలీవుడ్ భామ అమైరా దస్తూర్ వేసిన స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భార్యాభర్తల మధ్య జరిగే సరదా తగాదాలతో ప్రస్తుత తరానికి తగ్గట్లుగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హాసిని సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, వి.టి.వి.గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
