‘పుష్ప – 2’ : ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్, టైం లాక్

పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 నుండి పుష్ప పుష్ప అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమో ని రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ క్రేజీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version