‘రారా కృష్ణయ్య’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్


యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రారా కృష్ణయ్య’. జూలై 4న విడుదలైన ఈ సినిమాకి మొదటి వీకెండ్ తో పాటు మొదటి వారం కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమా మొదటి వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 3.47 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక్కడ బాగానే ఆదరణ పొందుతున్న ఈ సినిమాకి ఓవర్సీస్ లో ఆదరణ లబించలేదు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 5.5 కోట్లు.

ఇప్పటికే ఫస్ట్ వీక్ 3.47 కోట్ల షేర్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా 2.10 కోట్లకి అమ్ముడు పోవడం వల్ల ఈ చిత్ర ప్రొడక్షన్ టీంకి పెట్టిన మొత్తం వచ్చేసింది. ఇక రెండవ వారంలో ఏ మాత్రం థియేటర్స్ తగ్గకపోవడంతో బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు వస్తాయని చాలా హ్యాపీ గా ఉన్నారు. ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద మరో సినిమా పోటీ లేకపోవడం, సందీప్ కిషన్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి హిట్ అందుకోవడం వలన ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సందీప్ కిషన్ కి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత ‘రారా కృష్ణయ్య’ మరో కమర్షియల్ హిట్ సినిమా అవుతుంది.

సందీప్ కిషన్, రెజీన జంటగా నటించిన ఈ మూవీలో జగపతి బాబు, కళ్యాణి ముఖ్య పాత్రలు పోషించారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు.

Exit mobile version