ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘రాకా’ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా మారుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ భారీ విజువల్ ట్రీట్ గా ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇంకా రిలీజ్ కాకుండానే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అనేది ఒకింత గర్వకారణంగా మారింది. అయితే ఈ రికార్డుకి కూడా మేకర్స్ ఓ సెపరేట్ ఈవెంట్ ని పెట్టడం ఆసక్తిగా మారింది.
ఇక ఈ ఈవెంట్ మొత్తం ఎలా జరిగింది అనేది ఎక్కడా రివీల్ చేయలేదు. చిన్న ప్రోమో కట్ ని మాత్రమే వదిలారు. అయితే ఈ ఫుల్ ఈవెంట్ ని ఎక్కడ చూడొచ్చు అనేది రివీల్ చేశారు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారి ఓటిటి ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో రాకా గిన్నిస్ వరల్డ్ రికార్డు తాలూకా ఫుల్ ఈవెంట్ ని స్ట్రీమ్ చేయవచ్చు అని తెలిపారు. సో సన్ నెక్స్ట్ ఉంటే అసలు రాకా ఈవెంట్ ఎలా జరిగింది ఎవరెవరు ఏం చెప్పారు. హైలైట్స్ ఏంటి అనేది తెలుస్తుంది.
Watch the #Raaka Guinness World Record Felicitation Event – Full show now only on @sunnxt 🏆
▶️ https://t.co/U1vK0sDvh0@alluarjun @Atlee_dir @GWR#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords pic.twitter.com/RvnM6gP1rk
— Sun Pictures (@sunpictures) September 22, 2026
