‘రభస’ సూపర్ హిట్ సినిమా : అల్లుడు శీను హీరో.

Bellamkonda-Srinivas

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత, ప్రణిత హీరో హీరోయిన్లుగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రభస’. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో గణేష్ నిర్మించారు. ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో, నందమూరి అభిమానులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటికి ఖచ్చితంగా అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ‘అల్లుడు శీను’ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇప్పుడే తారక్ అన్నతో కలసి సినిమా చూశాను. సినిమా బాగుంది. గ్యారెంటీ ష్యూర్ షాట్ సూపర్ హిట్ సినిమా. అభిమానులకు పండగే. 29న సినిమా విడుదల అవుతుంది. కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీకి కూడా ‘రభస’లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు దర్శకుడు. తమన్ సంగీతం అందించిన పాటలకు ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని చిత్రబృందం చెప్తుంది.

Exit mobile version