
అల్లు అర్జున్, శృతిహాసన్ నటించిన రేసు గుర్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది పెద్ద హిట్ గా నిలవనుందని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకుడు. నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వర రావులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు
అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. ప్రేక్షకుల కోరిక మేరకు వారాంతరాలలో మరిన్ని షోలను వేసే ఆలోచనలో వున్నారు. ఇప్పుడు ఈ సినిమా బృందం ఒక పెద్ద సక్సెస్ మీట్ నిర్వహించనుంది. ఈ వేడుకలో హీరో హీరోయిన్ లతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు హాజరుకానున్నారు
థమన్ సంగీత దర్శకుడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, బ్రాహ్మి కామెడి టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలిపారు. ఈ సినిమాను మలయాళంలో విడుదలచేయనున్నారు. దీనికి ‘లక్కీ ది రన్నర్’ అనే పేరుతొ ఏప్రిల్ 25న మనముందుకు తీసుకురానున్నారు