టాలీవుడ్‌పై మళ్ళీ కామెంట్ చేసిన రాధికా ఆప్టే!

radhika-apte
‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి రాధికా ఆప్టే ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్‌లో అవకాశాలు రావడం పెరిగాక రాధిక తెలుగు సినీ పరిశ్రమపై ఓసారి నెగెటివ్ కామెంట్ చేసి వార్తల్లో నిలవగా, ఇప్పుడదే కామెంట్‌ను రిపీట్ చేసి తాజాగా మళ్ళీ వార్తలకెక్కారు.

తెలుగు సినిమాల్లో మళ్ళీ నటించడం లేదు ఎందుకు? అనే ఓ ప్రశ్నకు సమాధానంగా.. “తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ నేనే అంగీకరించడం లేదు. తెలుగులో హీరోయిన్లకు గౌరవమనేదే ఇవ్వరు. ఆ పద్ధతి నచ్చకే ప్రస్తుతానికి తెలుగు సినిమాలు ఒప్పుకోవట్లేదు” అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో న్యూడ్‌గా నటించడం, ఇంటర్నేషనల్ స్క్రీనింగ్‌కు తీసిన ఆ సినిమా ఆన్‌లైన్లో లీకవ్వడం వంటి సంచలనం రేపిన వార్తలతో బాలీవుడ్‌లో రాధికా ఆప్టే పేరు మారిపోగా, ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలతో మరింతగా వార్తల్లో నిలిచారు.

Exit mobile version