ఐదేసి లక్షల రూపాయలు డొనేట్ చేసిన విజయ్, రాధిక శరత్ కుమార్

vijay-radhika

విశాఖలో హుధూద్ తుఫాన్ వల్ల కలిగిన నష్టం పూడ్చలేనిది. పవన్, మహేష్, బాలయ్య, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, సమంత, కాజల్ వంటివారు స్పందించి తమ బాధ్యతగా పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. తర్వాత యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఉదారంగా విరాళాలు అందించారు. నేడు ప్రజల నుండి మరిన్ని విరాళాలు సేకరించడం కోసం ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

‘మేము సైతం’ కార్యక్రమం చూసి స్పందించిన ఇళయ దళపతి విజయ్ 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. తమిళ ఆర్టిస్టుల సంఘం నడిగర్ తరపున 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు అధ్యక్షుడు శరత్ కుమార్ ప్రకటించారు. అలాగే వ్యక్తిగతంగా శరత్ కుమార్ మరియు రాధిక శరత్ కుమార్ లు 5 లక్షలు విరాళం ఇచ్చారు.

తమిళ దర్శకుడు లింగుస్వామి 3 లక్షలు, నటుడు సత్యరాజ్ 2 లక్షలు, జయం రవి 50 వేలు మరికొందరు విరాళాలు ప్రకటించారు.

Exit mobile version