విజయ్ ప్లేస్ లో లారెన్స్ పోటీ.. బిగ్ క్లారిటీ ఇచ్చేసిన కాంచన హీరో

మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ రాఘవ లారెన్స్ ఆ మధ్య రాజకీయ ప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తను రావాలా వద్దా అనేది అభిమానులుకి వదిలేసాడు రాఘవ లారెన్స్. అయితే తమిళ స్టార్ నటుడు ఇప్పుడు సీఎం విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్టు వచ్చిన అనేక రూమర్స్ లో భాగంగా లారెన్స్ ప్రకటన ఇవ్వడం జరిగింది.

అయితే ఇప్పుడు విజయ్ తప్పుకున్న స్థానం నుంచి తను పోటీ చేయబోవడం లేదని తను క్లారిటీ ఇచ్చేసాడు. అలాగని రాజకీయాల్లోకి రావట్లేదు అని కూడా చెప్పలేదు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉందని వాటిని పూర్తి చేస్తానని కానీ తన సేవ మాత్రం ఆగదని కాంచన హీరో, దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ అనౌన్స్మెంట్ మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం లారెన్స్ బెంజ్, కాంచన 4 తదితర సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version