
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా వేసవి కానుకగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 2’ లారెన్స్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయన స్థాయిని పెంచింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం లారెన్స్ రెండు వరుస సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ‘మొట్ట శివ కెట్ట శివ’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుండగా, ‘నాగ’ ఆ తర్వాత సెట్స్‌పైకి వెళుతుంది.
ఇక నిన్న ఈ సినిమా లాంచ్ సందర్భంగా లారెన్స్, తనకు అడ్వాన్స్‌గా వచ్చిన కోటి రూపాయలను దానం చేశారు. యావత్ భారతానికి స్ఫూర్తి నింపిన వ్యక్తిగా పేరుగాంచిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొద్ది రోజుల క్రితం తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆయన పేరుమీద కలాం జ్ఞాపకార్థంగా ‘కలామిన్ కల్చవుడిల్’ పేరుతో లారెన్స్ ఈ కోటి రూపాయలను పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఉపయోగించనున్నారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన నాటినుండీ ఇలాంటి సమాజ సేవ చేస్తూ వస్తోన్న లారెన్స్, ఈ కార్యక్రమాలతో తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందని తెలిపారు.