రజినీ కోసం రెండు, పవన్ కోసం ఒకటి అంటున్న లారెన్స్

Lawrernce
గ్రూప్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ గా, కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా, డైరెక్టర్ నుంచి నటుడిగా రూపాంతరం చెందిన రాఘవ లారెన్స్ తను చేసిన అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ సక్సెస్ అందుకున్నాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘గంగ’ సినిమా ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తన తదుపరి సినిమాకి కాస్త గ్యాప్ తీసుకున్న రాఘవ లారెన్స్ తన తదుపరి సినిమా కోసం టాలీవుడ్ మరియు కోలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన స్టార్ హీరోస్ ని టార్గెట్ చేసాడు.

రాఘవ లారెన్స్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం రెండు కథలను సిద్దం చేసాడట, అలాగే టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒక కథని సిద్దం చేసాడట. త్వరలోనే వీరిద్దరిని కలిసి కథలు వినిపించే పనిలో రాఘవ లారెన్స్ ఉన్నాడు. మరి రాఘవ లారెన్స్ చెప్పబోయే కథలు అటు రజినీకాంత్, ఇటు పవన్ కళ్యాణ్ ని మెప్పిస్తుందా.? లేదా.? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మీరేమంటారు ఫ్రెండ్స్.. రజినీకాంత్ – రాఘవ లారెన్స్ లేదా పవన్ కళ్యాణ్ – రాఘవ లారెన్స్ కాంబినేషన్ పై మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ లో తెలపండి.

Exit mobile version