దయచేసి ఆవేశంతో స్పందించకండి – రాఘవ లారెన్స్

తమిళనాడు రాజకీయాన్ని యాభై ఏళ్లుగా శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు దళపతి విజయ్ గట్టి షాక్ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించి, సీఎం అయ్యారు. మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, శాఖలను కేటాయించారు. అయితే పలువురు మంత్రులకు కేటాయించిన శాఖలపై కోలీవుడ్ లో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం మినిస్టర్ గా రాజ్‌ మోహన్‌ను నియమించారు. అనుభవం లేని వ్యక్తికి ఆ శాఖను కేటాయించడం నిరుత్సాహపరుస్తోందని బాగా కామెంట్స్ వినిపించాయి.

ఈ కామెంట్స్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘మన గౌరవ ముఖ్యమంత్రి, స్నేహితుడు సీఎం జోసెఫ్ విజయ్ గారు ఖచ్చితంగా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి ఆవేశంతో స్పందించకండి. చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం మంత్రి రాజ్ మోహన్ గారు తన వంతు ఉత్తమ కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను’ అని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.

Exit mobile version