నూతన నటుడు శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం డర్టీ హరి. సీనియర్ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ ఆసక్తి రేపింది. తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా నేడు ఈ చిత్రంలో హీరోయిన్ లుక్ రివీల్ చేశారు.
గోల్డ్ కలర్ శారీ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న రుహని శర్మ లుక్… ఫస్ట్ లుక్ పోస్టర్ తో సంబంధం లేకుండా ఆసక్తికరంగా ఉంది. ఏదిఏమైనా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో డర్టీ హరి చిత్ర యూనిట్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎమ్ ఎస్ రాజు తూనీగ తూనీగ మరియు వాన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
