
మన సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ సాధించిన తొలి భారతీయుడిగా ఏ.ఆర్ రెహమాన్ చరిత్రలో నిలిచాడు. ఇప్పుడు మరోసారి ఆస్కార్ బరిలో తన సినిమాలను నిలుపుకోవడంలో సఫలీకృతమయ్యాడు. మిలియన్ డాలర్ ఆర్మ్, ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడయాన్ సినిమాలు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగంలో నామినేట్ అయ్యాయి
గతంలో స్లమ్ డాగ్ మిలియనియర్ చిత్రానికి గానూ రెహమాన్ కి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మరియు ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లకు ఆస్కార్ లు లభించాయి