
‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్, తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విని చివరకు ‘సినిమా చూపిస్త మావ’ అంటూ ఇప్పటికి రెండో సినిమాను సిద్ధం చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (ఆగష్టు 14న) విడుదల కానుంది. ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన ప్రేమకథలో ఒదిగిపోయిన రాజ్ తరుణ్ – అవికా గోర్ జంట ‘సినిమా చూపిస్త మావ’తో మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.
ఇక ట్రైలర్, పోస్టర్స్ ద్వారానే మంచి ఇంప్రెషన్ కలిగించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేసేందుకు ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయ్! అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించి అన్ని ప్రాంతాల బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇక తన మొదటి సినిమా తర్వాత చాలా కథలు విన్నానని, ఎన్నో కథల తర్వాత ఈ సినిమాను ఎంపిక చేసుకున్నానని, సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకొని మంచి విజయం సాధిస్తుందని హీరో రాజ్ తరుణ్ నమ్మకంగా చెబుతున్నారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్-రావు రమేష్‌ల పోర్షన్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.