సెన్సార్ చేయించుకున్న ‘రాజావారు రాణిగారు’ !

raja varu rani varu

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకం పై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ లవ్ ఎంటర్టైనర్ సన్నధం అవుతుంది.

ఇక కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ మరియు పాటలతో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

Exit mobile version