మహేష్ జెంటిల్‌మేన్‌ అని నిరూపించారు : రాజమౌళి

rajamouli-mahesh-
‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా కాగా, మరొకటి రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్. ఈ రెండు సినిమాలూ జూలై నెలలోనే ఒక్క వారం గ్యాప్‌లో విడుదలకు సిద్ధంగా కాగా, రెండు పెద్ద సినిమాలు ఇలా వారం తేడాలో విడుదల కావడం పరిశ్రమకు నష్టాలను తెచ్చిపెడుతుందన్న నేపథ్యంలో ‘శ్రీమంతుడు’ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే!

జూలై 10న ‘బాహుబలి’ విడుదల కానుండగా, జూలై 17న విడుదలకు ప్లాన్ చేసిన ‘శ్రీమంతుడు’ ఆగష్టు 7కు వాయిదా పడింది. తమ సినిమా కోసం ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసినందుకు బాహుబలి టీమ్ ఇంతకుముందే మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపగా, తాజాగా రాజమౌళి ఈ విషయమై ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ మహేష్‌పై ప్రశంసలు కురిపించారు.

‘బాహుబలి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. “మహేష్ లాంటి స్టార్ బాహుబలి కోసం తన సినిమాను వాయిదా వేయడమనేది అభినందించదగ్గ తగ్గ విషయం. అదీగాక ‘బాహుబలికి భయపడి శ్రీమంతుడును వాయిదా వేశారా?’ అన్న అనాలోచిత ప్రశ్నకు కూడా మహేష్ గారిచ్చిన సమాధానం ఆయన మంచితనాన్ని తెలియజేస్తుంది. మహేష్ అంత కూల్‌గా జెంటిల్‌మేన్‌ సమాధానమివ్వడాన్ని అభినందించాల్సిందే!” అన్నారు.

Exit mobile version