హాలీవుడ్ సినిమా పుకార్లను ఖండించిన రాజమౌళి.

rajamouli
హాలీవుడ్ లో మహాభారతం తెరకేక్కించాలి అనేది రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని నిర్మాత సురేష్ బాబు చెప్పడంతో ప్రముఖ ఇంగ్లీష్ వార్తపత్రిక ఊహాజనితమైన వార్తను ప్రచురించింది. హాలీవుడ్ యాక్షన్ హీరో జెట్ లీ, బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్లో రాజమౌళి సినిమా చేయడానికి సన్నాహలు చేస్తున్నారు అనేది ఆ వార్త సారంశం. వీటిని ఖండించారు రాజమౌళి.

‘జెట్ లీ..? రణబీర్ కపూర్..? హాలీవుడ్ సినిమా..? ఈ పుకార్లు ఎక్కడ నుండి పుడుతున్నాయో అర్ధం కావడం లేదు. టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కినంత సులువుగా చెప్పేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేంత టైం, ఆలోచించే తీరిక నాకు లేవు. ఏమైనా కొత్త సినిమా విశేషాలు ఉంటె నేనే స్వయంగా వెల్లడిస్తాను. ‘ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ.. తదితర నటులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

Exit mobile version