
మెగా హీరోలతో పాటు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా. చాలా రోజుల నుంచి చిరంజీవి తన 150వ సినిమా కోసం కథలు వింటున్నా ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఇటీవలే పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తాడు అనే వార్తలు వినిపించినా ఫైనల్ గా అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో చిరంజీవి, రామ్ చరణ్ లు మళ్ళీ కథల వేట మొదలు పెట్టారు. తాజాగా చిరు 150వ సినిమా కోసం ఈ ఏడాది ‘బాహుబలి’, ‘బజ్రంగి భాయ్ జాన్’ లాంటి 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు కథ అందించిన ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ అయిన వి విజయేంద్ర ప్రసాద్ ని రంగంలోకి దింపినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళితే.. మెగస్టార్ చిరంజీవి విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కథ తీసుకుంటుంటే బాగుంటుందనిపించి ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాకి వి విజయేంద్ర ప్రసాద్ మెయిన్ రైటర్ గా అయినా వ్యవహరించవచ్చు లేదా చిరు బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ కావాలో ఆ విధంగా తన రైటర్స్ కి గైడ్ చేసే స్క్రిప్ట్ కన్సల్టంట్ గా అన్నా పనిచేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫేమస్ రైటర్ చిన్ని కృష్ణ కూడా చిరు 150వ సినిమాకి కథని సిద్దం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరి ఫైనల్ గా ఎవరి స్క్రిప్ట్ చిరు ఓకే చేస్తాడా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ఇది కాకుండా చిరంజీవి త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి అందరినీ కనువిందు చేయనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.