
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తెలుగు వారంతా కాలర్ ఎగరేసుకొని గర్వంగా ఫీలయ్యేలా చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా రీలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పటికీ చాలా ఏరియాల్లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తర్వాత షార్ట్ హాలిడే ట్రిప్ కి వెళ్ళిన రాజమౌళి వెంటనే సెకండ్ పార్ట్ కి సంబందించిన వర్క్ ని మొదలు పెట్టాడు. గత కొద్ది రోజులుగా బాహుబలి 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడిపిన రాజమౌళి మరోసారి వర్క్ కి గ్యాప్ ఇచ్చి హాలిడేకి వెళ్లారు.
సెప్టెంబర్ 1వ తేదీన కంచె ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియాలోని బాలి అనే దీవికి హాలిడేకి వెళ్ళారు. అక్కడ కొద్ది రోజులు ఫ్యామిలీతో కలిసి హాలిడేని బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాక ఫుల్ ప్లెడ్జ్ గా బాహుబలి 2 వర్క్ ని మొదలు పెడతారు. మొదటి పార్ట్ కంటే మరింత భారీగా సెకండ్ పార్ట్ ని ఫినిష్ చేసే విధంగా రాజమౌళి వ్యూహరచన చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కూడా హాలిడేలో ఉన్నాడు. ఇద్దరు హాలిడే నుంచి రాగానే బాహుబలి 2 మొదలవుతుంది. అక్టోబర్ నుంచి బాహుబలి 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది.

