‘ఛత్రపతి’ వల్లే సినిమాల్లోకొచ్చా : చరణ్‌దీప్

Actor-Charndeep
దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, సినిమా ఇండస్ట్రీలో దర్శకుడవ్వాలనుకునే ఎందరికో ప్రేరణగా నిలవగలిగే చిత్రాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు పొందారు. రాజమౌళి ప్రేరణతో కేవలం దర్శకులే కాదు.. నటులూ పుట్టుకొచ్చారు. రాజమౌళి వల్లే తాను సినిమాల్లోకొచ్చానని ‘పటాస్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన చరణ్‌దీప్ అన్నారు. ప్రేక్షకులడిగిన ప్రశ్నలకు ఆయన వీడియో సందేశం ద్వారా సమాధానాలిచ్చారు.

తాను చదువుకునేప్పుడు ఛత్రపతి సినిమా విడుదలైందనీ, అందులో ప్రభాస్‌ను, రాజమౌళి టేకింగ్‌ను పదే పదే గుర్తుకు తెచ్చుకునేవాడినన్నారు. ఆ సినిమా ఇచ్చిన ప్రేరణతోనే సినిమాల్లో ప్రయత్నించానని అన్నారు. తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన జిల్లాతో పాటు పలు చిత్రాల్లో నటించిన చరణ్‌దీప్, పటాస్ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Exit mobile version