రాజమౌళి సినిమా 2020కి విడుదలవుతుందట !

‘బాహుబలి’ సక్సెస్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలని ఎదురుచూసిన అందరికీ రాజమౌళి రామ్ చరణ్, తారక్ లతో భారీ మల్టీ స్టారర్ సినిమాను సెట్ చేసి షాక్ ఇచ్చారు. మల్టీ స్టారర్లు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న నైపథ్యంలో జక్కన్న ఇలా ఇద్దరు టాప్ హీరోలను పెట్టి సినిమా చేస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇదిలా ఉండగా సినిమా గురించిన ఒక్క విషయాన్ని కూడ బయటకు రానీయకుండా సీక్రెసీ మైంటైన్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకు కావాల్సినంత క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నారు రాజమౌళి. తాజా సమాచారం మేరకు నవంబర్లో మొదలుకానున్న ఈ చిత్రం 2020కి విడుదలవుతుందని అంటున్నారు.

స్వతహాగా మేకింగ్ లో కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమాలను అందించే రాజమౌళి పెద్ద ప్రాజెక్ట్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం మామూలే అయినా అభిమానుల కోసమైనా 2019 చివరికి ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను డివివి. దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version